Verse
స్తుతి నీకే యేసు రాజా
మహిమ నీకే యేసు రాజా
స్తోత్రం నీకే యేసు రాజా
ఘనత నీకే యేసు రాజా
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా‖ 2x ‖
(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
త్వరలోనే రానున్నాడు
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు‖ 2x ‖
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా‖ 2x స్తుతి ‖
Verse
మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము‖ 2x ‖
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు‖ 2x ‖
తేజోవాసులతో స్తుతియింతుము‖ హోసన్నా ‖
Verse
సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము‖ 2x ‖
శ్రమలైనా శోధనలెదురైనా‖ 2x ‖
ఆర్భాటముతో సన్నుతింతుము‖ హోసన్నా స్తుతి ‖