Verse
స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని
మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము‖ 2x ‖
ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే‖ 2x ‖
ఆది అంతము లేనివాడు‖ 2x ‖
మార్పు చెందని – మహనీయుడు‖ 2x స్తుతి పాడి ‖
Verse
జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే‖ 2x ‖
ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు‖ 2x స్తుతి పాడి ‖
Verse
గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల‖ 2x ‖
తన బాహుబలము చేత‖ 2x ‖
బాగుచేయు బలవంతుడు‖ 2x స్తుతి పాడి ‖