Verse
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా‖ 2x ‖
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును‖ స్తుతి పాడుటకే ‖
Verse
ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు‖ 2x ‖
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను‖ స్తుతి పాడుటకే ‖
Verse
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు‖ 2x ‖
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను‖ స్తుతి పాడుటకే ‖
Verse
హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు‖ 2x ‖
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై‖ స్తుతి పాడుటకే ‖