Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Patruda Sthotrarhuda Sthu

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తు

Sthuthi Patruda Sthotrarhuda Sthu

Verse
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు
Verse
నా శత్రువులు నను తరుముచుండగా
నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు
Verse
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభు
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో

Related Tags

PraiseWorshipPrayer