Verse
స్తుతి సింహాసనాసీనుడా
యేసు రాజా దివ్య తేజా‖ 2x ‖
Verse
అద్వితీయుడవు పరిశుద్ధుడవు
అతి సుందరుడవు నీవే ప్రభూ‖ 2x ‖
నీతి న్యాయములు నీ సింహాసనాధారం‖ 2x ‖
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు‖ 2x స్తుతి ‖
Verse
బలియు అర్పణ కోరవు నీవు
బలియైతివి నా దోషముకై‖ 2x ‖
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం‖ 2x ‖
స్తుతియాగమునే చేసెద నిరతం‖ 2x స్తుతి ‖
Verse
బూరధ్వనులే నింగిలో మ్రోగగా
రాజధిరాజ నీవే వచ్చువేళ‖ 2x ‖
సంసిద్ధతతో వెలిగే సిద్దెతో‖ 2x ‖
పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును‖ 2x స్తుతి ‖