Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Simhaasanaaseenudaa

స్తుతి సింహాసనాసీనుడా

Sthuthi Simhaasanaaseenudaa

Verse
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా‖ 2x ‖
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్‖ 2x స్తుతి ‖
Verse
నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి‖ 2x ‖
నీ కోసమే – నీ కృప కోసమే‖ 2x ‖
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా‖ 2x స్తుతి ‖
Verse
నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని‖ 2x ‖
నీ కోసమే – నీ కృప కోసమే‖ 2x ‖
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా‖ 2x స్తుతి ‖
Verse
నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని‖ 2x ‖
నీ కోసమే – నీ కృప కోసమే‖ 2x ‖
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా‖ 2x స్తుతి ‖

Related Tags

PraiseWorshipDevotional