Verse
స్తుతి స్తోత్రం యేసయ్య
ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా
ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా
కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను
కలత నేను చెందను కన్నీళ్లు విడువను
ఆకాశం పై నీ సింహాసనమున్నది రాజదండంతో నన్నేలుచున్నది
నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించి-
నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించితివి
నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా
ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను నడిపించు చున్నావు
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చి-
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి
నీవుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదయ్యా
ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది
నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపి-
నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి
ఆకాశం నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షం నీ చేతి పనులు ప్రచురించుచున్నది
భాష లేని మాటలేని స్వరమే వినబడని-
భాష లేని మాటలేని స్వరమే వినబడనివి
పగలు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది
క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకై నిర్మించుచున్నావు
మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా
ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య
కలవరము నొందను
నిను నమ్మి యున్నాను
కలత నేను చెందను
కన్నీళ్ళు విడువను