Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Sthuthi Sadhayudaina Yesu

స్తుతి స్తుతి సదయుఁడైన యేసు

Sthuthi Sthuthi Sadhayudaina Yesu

Lyricist: Fanny Crosby
Verse
స్తుతి స్తుతి సదయుఁడైన యేసు
నూటి న్నీకుసృష్టి చెల్లించును
నీతిమంతా నిఖిల దూతలు చేరి
నీకే కీర్తి భక్తిఁజెల్లింతురు.
చేతనుంచి పిల్లల నెల్లను యేసు
మితిలేని ప్రేమను గాచును.
స్తుతి స్తుతి సదయుఁడైన యేసు‖ స్తుతి స్తుతి సదయుఁడైన యేసు ‖
ఖ్యాతితో నీకెన్నఁడొనర్తుము‖ ఖ్యాతితో నీకెన్నఁడొనర్తుము ‖
Verse
స్తుతి స్తుతి సదయుఁడైన యేసు
స్తోత్రముల్ మా స్వామికి
చెల్లును
ప్రీతిన్ మాకై మరణమొందుచు
యేసు
ప్రేమఁ జూపి ప్రజలఁబ్రోచితే
రాతి కోట వైతివి మాకు నీవు
రక్షకుండ కరుణసాగరా.
Verse
ఆకాశంపు గవునులారా మీరు
ఆనంద పాటలను పాడుఁడీ
ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు
లోకాంతంబుల్ వెలుఁగ నేలును
వీఁక తోడవేగ వచ్చును యేసు
వాకంబెల్ల నదురునట్లుగాన్.

Related Tags

PraiseWorship