Verse
స్తుతికి పాత్రుడ యేసయ్యా
నా స్వాస్థ్య భాగము నీవయ్యా‖ 2x ‖
పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద‖ 2x ‖
నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత
నీవే నా విడుదల‖ 2x స్తుతికి ‖
Verse
పాప ఊభిలో నుండి – పైకి లేపితివి
మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి‖ 2x ‖
నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ
నీ వెనకే చేరెద యేసూ‖ 2x నీవే ‖
Verse
జీవాహారము నీవే – జీవ జలము నీవే
నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి‖ 2x ‖
ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును
యేసు రాజా నీ యెదుట‖ 2x నీవే ‖