Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiki Paathrudaa Sathya Sheeludaa

స్తుతికి పాత్రుడా సత్య శీలుడా

Sthuthiki Paathrudaa Sathya Sheeludaa

Verse
స్తుతికి పాత్రుడా సత్య శీలుడా‖ 2x ‖
నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా
నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా‖ 2x స్తుతికి పాత్రుడా ‖
Verse
ప్రేమధ్వజమును సిలువలో నిలిపి
అనంతప్రేమను చూపితివి
పాపమునుండి విడిపించి
రక్షణవస్త్రం నొసగితివి‖ 2x ‖
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
వర్ణించలేనిది వివరించలేనిది‖ 2x స్తుతికి పాత్రుడా ‖
Verse
యోగ్యతలేని మాకై నీ
పౌరసత్వాన్ని ఇచ్చితివి
పరిశుద్దాత్మను మాకొసగి
బలవంతులుగా చేసితివి‖ 2x ‖
ఎలాగు మరువను ఎలాగు విడువను
నీ స్నేహము నీ బంధము‖ 2x స్తుతికి పాత్రుడా ‖

Related Tags

PraiseWorshipGraceLove