Chorus
స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే
Verse
ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చె
చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము‖ చేరిపాడి స్తుతించెదము ‖
Verse
సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే
వినిన వారిని ప్రత్యేకించే - చేరిపాడి స్తుతించెదము‖ చేరిపాడి స్తుతించెదము ‖
Verse
పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు
సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము‖ చేరిపాడి స్తుతించెదము ‖
Verse
సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెను ప్రభువే
సహపని వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము‖ చేరిపాడి స్తుతించెదము ‖
Verse
ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసె
స్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము‖ చేరిపాడి స్తుతించెదము ‖
Verse
పరమ దర్శనము నిచ్చె - సరిగా లోబరచె మనల
కరము నిచ్చె నడిపించె - చేరిపాడి స్తుతించెదము‖ చేరిపాడి స్తుతించెదము ‖
Verse
సంఘ మర్మనును దెల్పి - శీఘ్రముగ నంపెను వార్త
పార్చె పాపుల నెందరినో - చేరిపాడి స్తుతించెదము‖ చేరిపాడి స్తుతించెదము ‖