Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthinchedanu Ninnu Nenu Manasaaraa

స్తుతించెదను నిన్ను నేను మనసారా

Sthuthinchedanu Ninnu Nenu Manasaaraa

Verse
స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను‖ 2x స్తుతించెదను ‖
Verse
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు‖ 2x ‖
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే‖ 2x స్తుతించెదను ‖
Verse
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు‖ 2x ‖
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య‖ 2x స్తుతించెదను ‖
Verse
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా‖ 2x ‖
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును‖ 2x స్తుతించెదను ‖

Related Tags

PraiseWorship