Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthinchedanu Sthuthinchedanu

స్తుతించెదను స్తుతించెదను

Sthuthinchedanu Sthuthinchedanu

Verse
స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము‖ స్తుతించెదను ‖
Verse
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక‖ 2x ‖
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని‖ 2x ‖
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను‖ 2x స్తుతించెదను ‖
Verse
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి‖ 2x ‖
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప‖ 2x ‖
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి‖ 2x స్తుతించెదను ‖
Verse
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి‖ 2x ‖
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన‖ 2x ‖
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా‖ 2x స్తుతించెదను ‖
Verse
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును‖ 2x ‖
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా‖ 2x ‖
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి‖ 2x స్తుతించెదను ‖
Verse
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన‖ 2x ‖
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా‖ 2x ‖
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా‖ 2x స్తుతించెదను ‖

Related Tags

PraiseThanksgiving