Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthinchedanu Sthuthinchedanu

స్తుతించెదనుస్తుతించెదనూ

Sthuthinchedanu Sthuthinchedanu

Verse
స్తుతించెదను..స్తుతించెదనూ..
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము - స్తుతించెదను‖ 2x ‖
Verse
ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్విపరిపాలక
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా - ఎల్లప్పుడును - ఉత్సాహధ్వనితో పాడెదను‖ 2x స్తుతించెదను ‖
Verse
నాశనకరమైన పాప గుంటనుండి నరక వేదననుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మలా స్వరూప
నీతి సమాధానం సంతోషముతో - నిత్యజీవము నాకీచ్చితివి‖ 2x స్తుతించెదను ‖
Verse
పాపము క్షమించి రోగము - బాపి భయమును దీర్చి
పవిత్రదాయక పావనమూర్తి - పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు - పరమరాజా పుణ్యదేవా‖ 2x స్తుతించెదను ‖
Verse
తల్లిగర్భమునకు ముందేర్పరచి -దేహము నమర్చియు
దక్షిణ బాహుతొ పట్టుకొనిన - దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు -దయతో అనుగ్రహించితివి‖ 2x స్తుతించెదను ‖
Verse
సిలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ - సంశయ హరక
శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా‖ 2x స్తుతించెదను ‖

Related Tags

PraiseWorshipThanksgiving