Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthinchi Paadedam

స్తుతించి పాడెదం

Sthuthinchi Paadedam

Verse
స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము‖ 2x స్తుతించి ‖
Verse
గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు
వ్యధలన్ని తీసావు‖ 2x ‖
గతి లేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి‖ 2x ‖
శత సంఖ్యగా మమ్ము దీవించావు‖ స్తుతించి ‖
Verse
కరుణా కటాక్షములను కిరీటములగాను
ఉంచావు మా తలపై‖ 2x ‖
పక్షి రాజు యవ్వనమువలె
మా యవ్వనమునంతా‖ 2x ‖
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు‖ స్తుతించి ‖

Related Tags

PraiseWorshipThanksgiving