Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthinchu Sthuthinchu Prabhu Yesu Ne Sthuthinchu

స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు

Sthuthinchu Sthuthinchu Prabhu Yesu Ne Sthuthinchu

Chorus
స్తుతించు - స్తుతించు - ప్రభు యేసు నే స్తుతించు‖ 2x ‖
నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే‖ 2x ‖
జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే‖ 2x ‖
Verse
ప్రేమించెను నిన్ను ఆయనే - శాశ్వత ప్రేమచే
ఏర్పరచు కొనె నిన్ను - భూమి పుట్టకమునుపే
దేవుడే నరరూపియాయె - ఆయన పేరు యేసు ప్రభు‖ 2x ఆయన ‖
Verse
యాకోబును సృజియించే - ఇశ్రాయేలుకు రూపునిచ్చే
నీకు తోడైయుందున్ - భయపడకుమని పలికె
పేరు పెట్టి పిలిచి - నా సొత్తు నీవనెను‖ 2x నా సొత్తు నీవనెను ‖
Verse
ప్రేమించి నన్ను రక్షించే - స్తుతి చెల్లించి పూజింతున్
తన రూపము నాకు నిచ్చే - ఆరాధించి ఘనపరతున్
పరలోక పౌరినిగ చేసెన్ - హౄదయార్పన నర్పింతున్‖ 2x హృదయార్పన నర్పింతున్ ‖
Verse
సహవాసములో నిలిచి - ప్రత్యక్షత యందుండి
ఏమి సంభవించిననూ - ప్రభు పక్షము నుండవలెన్
అంతమందు బహుమానమిత్తున్ - అని ప్రభువే చెప్పెనుగా

Related Tags

PraiseWorshipCreator