Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthinchudayana Nakashavasulara

స్తుతించుడాయన నాకాశవాసులారా

Sthuthinchudayana Nakashavasulara

Verse 1
Reference: యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతియించుదురు గాక! ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది. కీర్తన Psalm 148
Verse
స్తుతియించుడాయన నాకాశవాసులారా
స్తుతియించుడి ఉన్నతస్థలములలో
Chorus
స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి
Verse
స్తుతియించుడి దూతలారా మీరందరు
స్తుతియించుడాయనన్ సైన్యములారా
Verse
స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు
కాంతిగల నక్షత్రములారా
Verse
స్తుతియించుడి పరమాకాశములారా
స్తుతియించుడి ఆకాశ జలములారా
Verse
స్తుతియించుడి సమస్త మకరములారా
స్తుతియించుడి అగాధ జలములారా
Verse
స్తుతియించుడగ్నియు వడగండ్లార
స్తుతియించుడాయన నావిరి హిమమా
Verse
స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను
స్తుతియించుడి పర్వతములు గుట్టలారా
Verse
స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా
స్తుతియించుడి దేవదారు వృక్షములారా
Verse
స్తుతియించుడి మీరు కౄర మృగములారా
స్తుతియించుడి మీరు సాధు జంతువులారా
Verse
స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా
స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా
Verse
స్తుతియించుడాయనన్ భూరాజులారా
స్తుతియించుడి సమస్త జనంబులారా

Related Tags

PraisePsalm