Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyimthumu Sthoathrimthumu Paavanudagu Maa Parama Thandri

స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రి

Sthuthiyimthumu Sthoathrimthumu Paavanudagu Maa Parama Thandri

Verse
స్తుతియింతుము - స్తోత్రింతుము
పావనుడగు మా - పరమ తండ్రి
Verse
నీ నామము ఋజువాయే - నీ ప్రజలలో దేవా
వర్ణింప మా తరమా - మహిమ గలిగిన నీ నామమును
Verse
మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై - రక్తమును కార్చిన రక్షకుడా
Verse
మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియుని
ప్రియమగు కాపరులన్ - ప్రియమారా మా కొసగిన తండ్రి
Verse
పరిశుద్ధ జనముగా - నిర్దోష ప్రజలుగా
పరలోక తనయులుగా - పరమ కృపతో మార్చిన దేవా
Verse
సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమును
పరిపూర్ణంబుగ సలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి
Verse
ప్రభు యేసు క్రీస్తులో - పరలోక విషయములో
ప్రతియాశీర్వాదములన్ - ప్రాపుగ నొసగిన పరమ తండ్రి
Verse
ఎల్లరిలో జీవజలం - కొల్లగ పారునట్లు
జీవంబు నిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ

Related Tags

PraiseWorship