Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyinchi Keerthinchi

స్తుతియించి కీర్తించి

Sthuthiyinchi Keerthinchi

Lyricist: Sunil Prem Kumar
Verse
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా‖ 2x ‖
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా‖ స్తుతియించి ‖
Verse
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా‖ 2x ‖
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా‖ 2x ‖
నీ ప్రజలను పోషించినావా‖ స్తుతియించి ‖
Verse
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు‖ 2x ‖
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు‖ 2x ‖
నీ ప్రజలను రక్షించినావు‖ స్తుతియించి ‖
Verse
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే‖ 2x ‖
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా‖ 2x ‖
మము పరముకు నడిపించు దేవా‖ స్తుతియించి ‖

Related Tags

PraiseWorshipAdoration