Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyinchu Prabhun Sthuthiyinchu Neevu

స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు

Sthuthiyinchu Prabhun Sthuthiyinchu Neevu

Verse
స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు
నా ప్రాణమా నా సమస్తమా
Verse
ఆయన చేసిన ఉపకారములలో
నా ప్రాణమా నీవు మరువకుమా - దేనిన్ - నా‖ దేనిన్ నా ‖
నీ దేవుని నీవు మరువకుమా
Verse
నీ దోషములను మన్నించి వేసి
నీ రోగముల నన్నింటిని - ప్రభు - నీ‖ ప్రభు నీ ‖
కుదుర్చి వేయుచున్నాడు
Verse
నా ప్రాణమును సమాధి నుండి
విమోచించిన వాడని - ప్రభు - విమో‖ ప్రభు విమో ‖
కరుణా కిరీటము నియ్యన్
Verse
పక్షిరాజు యౌవనము వలె
నూతన యౌవన ముండునట్లు - నీకు - నూతన‖ నీకు నూతన ‖
మేలుతో తృప్తిపరచును
Verse
దీర్ఘశాంతుడు దయగల దేవుడు
యెల్లప్పుడు వ్యాజ్యమాడడు - నీతో - ఎల్లప్పుడు‖ నీతో ఎల్లప్పుడు ‖
ప్రతీకారము చేయడు
Verse
భూమికంటె ఎంత ఆకాశమెత్తో
భక్తుల యెడల కృపనంత - తన - భక్తుల‖ తన భక్తుల ‖
అధికముగా చేసియున్నాడు
Verse
పడమటికి తూర్పెంత యెడమో
పాపములకును మనకంత - మన - పాప‖ మన పాప ‖
యెడము గలుగ జేసెను
Verse
తండ్రి తన కుమారుని యెడల
జాలిపడునట్లు యెహోవా - బహు - జాలి‖ బహు జాలి ‖
భక్తులపై జాలిపడును
Verse
మంటివాడవని ఆయన యెరుగున్
నిర్మింపబడిన విధమెరుగున్ - నీవు - నిర్మి‖ నీవు నిర్మి ‖
నీ దేవుడు నిన్ను నెరుగును
Verse
దేవదూతలారా దైవభక్తులారా
యెహోవా మహాసైన్యములారా - ఓ - యెహోవా‖ ఓ యెహోవా ‖
హల్లెలూయ పాట పాడుడి

Related Tags

PraiseWorshipPsalm