Verse
స్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని‖ 2x స్తుతియింతుము ‖
Verse
నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా‖ 2x ‖
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును‖ స్తుతియింతుము ‖
Verse
మా ప్రభువా మా కొరకై
సిలువలో సమసితివి‖ 2x ‖
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా‖ స్తుతియింతుము ‖
Verse
పరిశుద్ధ జనముగా
నిర్దోష ప్రజలనుగా‖ 2x ‖
పరలోక తనయులుగా
పరమ కృపతో మార్చిన దేవా‖ స్తుతియింతుము ‖