Verse
స్తుతియింతుము యేసు ప్రభువా‖ 2x ‖
మా స్తుతికి పాత్రుడా‖ 2x ‖
నిత్యం నిన్నే ఆరాధించి‖ 2x ‖
మహిమ పరతుము ఇలలో‖ 2x ‖
స్తుతికి పాత్రుడా‖ 2x ‖
Verse
మా పాపములు మమ్ము నీకు - బహుదూరంబు జేయగా
ఏ పాపమెరుగని ప్రభువా - మాకై సిలువలో బలియైతివా
నీ రక్తముతో మమ్ము కడిగి - నీ చెంతకు చేర్చితివా
Verse
లోకాశకు లొంగిపోయి - నీ సహవాసమును వీడగ
ఆకాశమును వీడి మాకై - నీతో సహవాస మొసగితివా
పరిశుద్ధులుగా మమ్ము తీర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చితివా
Verse
సాతానుకు దాసులమై - నిత్య మార్గమును వీడగ
పతనమైన మా బ్రతుకుల్ - నిత్య జీవముగా మార్చితివా
నిత్యము నిన్నే సేవింప - సత్యవాక్యము నొసగితివా
Verse
నిరీక్షణ లేక మేము - నిర్భాగ్యులమై యుండగా
త్వరగా రానై యున్న ప్రభువా - పరమ నిరీక్షణ నిచ్చితివా
నీ రాకకై ఎదురు చూడ - సిద్ధపాటును నొసగితివా