Verse
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా‖ 2x స్తుతియు ‖
Verse
మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము‖ 2x ‖
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము‖ 2x ‖
కొనియాడేదము మరువబడని మేలుల చేసెనని‖ 2x స్తుతియు ‖
Verse
నీవొక్కడవే గొప్ప దేవుడవు
ఘనకార్యములు చేయుదువు‖ 2x ‖
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా‖ 2x ‖
నిన్ను మేము ఆనందముతో ఆరధించెదము‖ 2x స్తుతియు ‖
Verse
నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి‖ 2x ‖
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా‖ 2x ‖
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను‖ 2x స్తుతియు ‖
Verse
భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితివన్ని మా కొరకు‖ 2x ‖
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్‖ 2x ‖
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము‖ 2x స్తుతియు ‖