Chorus
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా
Verse
మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము
మేమందరము ఉత్సహించి సంతోషించెదము
కొనియాడెదము మరువబడని మేలులజేసెనని
Verse
నీ వొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు
నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము
Verse
నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపై
ఖ్యాతిగ నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు
ప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా
Verse
నీవే మాకు పరమప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా
నడిపించెదవు సమభూమిగల ప్రదేశములో నన్ను
Verse
భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మాకొరకై
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్
పరము నుండి మాకై వచ్చే ప్రభుయేసు జయము