Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthiyu Mahimayu Neeke Kshithikina

స్తుతియు మహిమయు నీకె క్షితికిన

Sthuthiyu Mahimayu Neeke Kshithikina

Lyricist: Mungamuri Devadasu
Chorus
స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు
మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ
నీ కెట్లు చూపుదుము‖ స్తుతియు ‖
Verse
పసిఁడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి
విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్
బ్రసరించు కో తలో పల నుందు వీవు‖ స్తుతియు ‖
Verse
నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు
నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు
ఋణపడి యు న్నాము నీకు‖ స్తుతియు ‖
Verse
దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్
ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ వరము
లమర్చిన పరమోపకారి‖ స్తుతియు ‖
Verse
జీవంబు ప్రేమను జేవఁ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి
దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మరించు‖ స్తుతియు ‖
Verse
నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయెఁ గృ
పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి
తేగలము పరిపూర్ణ జనకా‖ స్తుతియు ‖
Verse
మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల
వస్తువులు శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు
లోపంబు లేక‖ స్తుతియు ‖
Verse
జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వ భావంబు శక్తియు భాగ్యంబులు
నీవలననే లభ్యమై వెలయుచున్నవి నీ వాసమే మాకు నిత్యానందంబు‖ స్తుతియు ‖

Related Tags

PraiseWorshipThanksgiving