Verse
Reference: నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను నిర్గమ Exodus 3:4
Chorus
స్తుతులకు పాత్రుండవు
సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు
Verse
జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తిపరచిన ప్రియుడవు నీవే
గొప్ప కార్యము చేయ - మా సామర్ధ్యము నీవే
Verse
లోకమునకు వెలుగు నీవేగా - మా నేత్రముల తెరచితివిగా
అద్భుతము చేసితివి - మా ప్రకాశము నీవే
Verse
ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావు
పూర్ణ క్రియ చేసితివి - సంపూర్ణ శాంతి నీవే
Verse
మంచికాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివి
విడుదల చేసితివి - గొర్రెల నడిపెదవు
Verse
పునరుత్థాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి
విజయంబు నిచ్చితివి - నూతన పరచితివి
Verse
మార్గ సత్యము మాకిల నీవే - దుర్బోధ నుండి కాపాడినావు
చేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి
Verse
నిజమైన ద్రాక్షవల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేము
లోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి