Verse
స్తుతులపై ఆసీనుడా
అత్యున్నత నా దేవుడా‖ 2x ‖
నీ ప్రేమలో నీ ప్రేమలో
నను నేను మరిచాను నీ ప్రేమలో
నీ నీడలో నీ జాడలో
మైమరచిపోయాను నేను‖ స్తుతులపై ‖
Verse
నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు
నీవు పొందిన గాయాలకు బదులు‖ 2x ‖
బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు
వెండినడుగలేదు నీవు
విరిగి నలిగి – కరిగి వెలిగే
హృదయాన్నే కోరావు నీవు‖ 2x ‖
ఓ మాట సెలవియ్యి దేవా
నీ పాద ధూళిని కానా ప్రభువా
నీ పాదం స్పర్శించగానే
నా సంతోషానికి హద్దుండునా‖ స్తుతులపై ‖
Verse
నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు
మా బ్రతుకులో విజయము మొదలు‖ 2x ‖
మరణం అనేటి ముల్లును విరచి
తిరిగి లేచావు నీవు
చీకటి నిండిన మాదు బ్రతుకులో
వెలుగులు నింపావు నీవు‖ 2x ‖
నీకోసం ఏదైనా దేవా
నే వెచ్చింప సంసిద్ధమయ్యా
ఆఖరికి నా ప్రాణమైనా
చిందులు వేస్తూ అర్పిస్తా‖ స్తుతులపై ‖