Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stothraarpana Narpimthamu Japa Dhoopama

స్తోత్రార్పణ నర్పింతము జప ధూపమ

Stothraarpana Narpimthamu Japa Dhoopama

Lyricist: Samuyelu Pakyanathamu
Chorus
స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుం డైన
శ్రీ యేసుఁడు పరమ భోజనాంశమైనందున‖ స్తోత్రార్పణ ‖
Verse
కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు
బలి నియ్యఁగాఁ పుట్టె నూతనంపు నిబంధన‖ స్తోత్రార్పణ ‖
Verse
పాపము లన్ని హరించెను మా ప్రభు వగు యేసు సురక్తము ఏపుగ
దీనిఁ దలంచుచు నిఁక నెన్నఁడు యేసుని భజింతము‖ స్తోత్రా ‖
Verse
చావు నుండి రక్షించెను స జీవులలో లెక్కించెను దేవుని కిఁక
నర్పింతము స జీవార్పణ బలిగను‖ స్తోత్రా ‖
Verse
పుణ్యరక్త శరీరముల లోఁ పాలొందు మన మందరము అన్యులము
కానేరము దై వాన్యోన్యంబు నొందినాము‖ స్తోత్రా ‖
Verse
మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా
యేసు మరణంబును యింకఁ చిరకాలంబుఁ జాటింతము‖ స్తోత్రా ‖

Related Tags

WorshipThanksgivingCommunion