Chorus
స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ - వేలాది వందనాలు
కల్గుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు - స్తుతి స్తోత్రముల్
యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా‖ 4x ‖
Verse
శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను‖ 2x ‖
యేసే నా సర్వము - యేసే నా సమస్తము‖ 2x యేసయ్యా ‖
Verse
పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను
మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను‖ 2x ‖
సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను‖ 2x యేసయ్యా ‖