Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stothrimchi Keerthimthumu Ghanaparachedhamu Koniyaadedhamu

స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము

Stothrimchi Keerthimthumu Ghanaparachedhamu Koniyaadedhamu

Chorus
స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము
ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు
Verse
మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనే మనకై
మనల నడిపెను సుఖముగను
తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ‖ ఆ ‖
Verse
ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు
ముదమున తనచిత్తము తెలుపున్
పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు ఆ‖ ఆ ‖
Verse
అన్ని సమయములలో - కన్నులతో బోధించును
నన్ను మార్చెను తప్పినన్
పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు ఆ‖ ఆ ‖
Verse
అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు
తగిన సహాయము చేయును
ఎక్కాలమందున కునుకవు - మక్కువ పిల్లలకు ఆ‖ ఆ ‖
Verse
హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను
ఇశ్రాయేలుల కనికరించె
ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు ఆ‖ ఆ ‖
Verse
నీతిమంతుల జూచె - దాదిబోలె కాచెను
జ్యోతుల వలె నుండును
అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు ఆ‖ ఆ ‖
Verse
ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడును
ఎడతెగని చెడుగుల బాపున్
రీడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయ ఆ‖ ఆ ‖

Related Tags

PraiseWorshipThanksgiving