Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stothrinthumu Ninu Maadu Thandri Sathyamutho Aathmatho Nepudu

స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెపుడు

Stothrinthumu Ninu Maadu Thandri Sathyamutho Aathmatho Nepudu

Verse
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు
Verse
పరిశుద్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
Verse
శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున
త్రిత్వమై యేకత్వమైన త్రి-లోక నాథా శరణం శరణం
Verse
పాపి మిత్రుడ పాప నాశక - పరమవాసా ప్రేమపూర్ణా
వ్యోమపీఠుడా స్వర్ణమయుడా - పరిశుద్ధాంగుడ శరణం శరణం
Verse
ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడు వాడా
నను రక్షించిన రక్షకుండవు - నాథ నీవే శరణం శరణం
Verse
బంగారు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడినవి
వేలలో నతి కాంక్షణీయుడా - వేలకొలది శరణం శరణం
Verse
గువ్వల వంటి కన్నులు - పువ్వుల వంటి చెక్కిళ్ళు
మంచి రూపము కలిగినందున - మాకు నీవే శరణం శరణం
Verse
చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివి
కాళ్ళు రాతిస్తంభములవలె - కన్పడుచున్నందున శరణం
Verse
సంఘమునకు శిరస్సు నీవే - రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం
Verse
నీదు సేవకుల పునాది - జ్ఞనమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు - వేడుకొందుము శరణం శరణం
Verse
రాజ నీకే నమస్కారములు - గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యము - హల్లెలూయ ఆమెన్ ఆమెన్

Related Tags

WorshipAdoration