Chorus
స్తోత్రార్హుడా- నా యేసయ్యా
సకలమును నీ వశమే గదా నా {2}‖ 2x ‖
నా హృదయమే నీ ఆలయం -
నివసించుమా నా ఆత్మ నాధుడా {2}‖ 2x ‖
Verse
జిగటమంటిని - తీసుకొంటివి
నీ రూపములో నను మలచుకొంటివి {2}‖ 2x ‖
ఆత్మను పంపావు - జీవింపజేసావు
మంటిని నాపై - కృప చూపించావు {2}‖ 2x ‖
స్తోత్రములు నా పరమ కుమ్మరి {4}‖ 4x ‖
Verse
భూమియును ఆకాశమును
సమస్తమును నీవే గదయ్యా {2}‖ 2x ‖
ఫలించమన్నావు ఆశీర్వదించావు
అన్నిటిపై అధికారము నిచ్చావు {2}‖ 2x ‖
స్తోత్రములు నా యజమానుడా {4}‖ 4x ‖
Verse
పోషించితివి ఆకాశము తెరచి
తృప్తిపరచినావు బండను చీల్చి {2}‖ 2x ‖
అగ్ని స్తంబమై మేఘ స్తంభమై
కాపాడుకున్నావు నీ జనులకు తండ్రివై {2}‖ 2x ‖
స్తోత్రములు నా మంచి కాపరి {4}‖ 4x ‖
Verse
నీవంటి దేవుడు ఎక్కడున్నాడు
అగ్నిగుండమైనను విడువ లేదుగా {2}‖ 2x ‖
భీకరమైన నీదు కార్యములు
తలంచగా నే మైమరచితినే {2}‖ 2x ‖
స్తోత్రములు సర్వశక్తిమంతుడా {4}‖ 4x ‖
Verse
పాపిని రక్షింప - పరమునుండి వచ్చి
పరిశుద్ధ రక్తంతో - నను శుద్ధి చేసి {2}‖ 2x ‖
మరణపు ముల్లును విరిచితివే నీవు
శాశ్వత జీవము నాకొసగితివే‖ 2x ‖
స్తోత్రములు నా జయశీలుడా {4}‖ 4x ‖