Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stuthi Paadutake Brathikinchina

స్తుతి పాడుటకే బ్రతికించిన

Stuthi Paadutake Brathikinchina

Lyricist: John Wesley
Verse
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖ: దినములు
కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై

Related Tags

PraiseWorshipThanksgiving