Chorus
స్తుతించుడి మీరు స్తుతించుడి
యెహోవా దేవుని స్తుతించుడి - స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
ఓ దూతలారా పరమ సైన్యమా
సూర్యచంద్రులారా తారాగణమా ప్రభునే స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
పరమాకాశమా పైనున్న జలమా
సృష్టికర్తను స్తుతించుడి నాథుని స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
మకరములారా అగాధ జలమా
అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా కర్తను స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
పర్వత శిఖర వృక్షములారా
మృగ పక్షి ప్రాకు పురుగులారా కాపరిని స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
భూరాజులారా సర్వ ప్రజలారా
అధిపతులు యౌవనులు కన్యకలు రారాజుని స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
మహోన్నతుండు ఇహ పరములలో
ఐశ్వర్యవంతుని స్తుతించుడి దేవుని స్తుతించుడి‖ స్తుతించుడి ‖
Verse
ప్రజలెల్లరికి రక్షణ శృంగము
ఇశ్రాయేలీయులకు భక్తులకును తండ్రిని స్తుతించుడి‖ స్తుతించుడి ‖