Chorus
స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ
Verse
యథార్థవంతుల సంఘములో
హృదయపూర్తిగా స్తుతింతున్ - స్తుతింతున్ హల్లెలూయ‖ 1x ‖
Verse
నీ క్రియలను దేవా ఆశించువారు
నీ యొద్ద విచారించెదరు - స్తుతింతున్ హల్లెలూయ‖ 2x ‖
Verse
దేవా నీ పనులు - ప్రభాము గలవి
నీ నీతి సదా నిలుచును - స్తుతింతున్ హల్లెలూయ‖ 3x ‖
Verse
యెహోవా అద్భుత కార్యములకు
జ్ఞాపక సూచన నుంచెను - స్తుతింతున్ హల్లెలూయ‖ 4x ‖
Verse
దయతో నిండిన దేవుడెహోవా
దాక్షిణ్య పూర్ణుడెహోవా - స్తుతింతున్ హల్లెలూయ‖ 5x ‖
Verse
భక్తి తనయందు గల్గిన వారికి
భోజనము నిచ్చి యున్నాడు - స్తుతింతున్ హల్లెలూయ‖ 6x ‖
Verse
యెహోవా చేసిన నిబంధనను
యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును - స్తుతింతున్ హల్లెలూయ‖ 7x ‖