Chorus
స్తుతింతున్ స్తుతింతున్ - నాకాలోచన కర్తయగు దేవుని
రాత్రివేలలో నా - అంతరింద్రియములు నాకు నేర్పున్
Verse
నాదు స్వాస్థ్య పానీయ భాగము - నా యెహోవా నీవే కాపాడెదవు
మనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్‖ స్తుతింతున్ ‖
Verse
శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను - సదాకాలము యెహోవాయందు నా
గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్‖ స్తుతింతున్ ‖
Verse
నా కుడి పార్శ్వమందాయన యున్నాడు - గాన కదల్చబడలేను ఎన్నడు
అందుచేత నా హృదయ మానిందించును - స్తుతింతున్‖ స్తుతింతున్ ‖
Verse
నా శరీరము సురక్షితంబుగా - నివసించుచున్నది ఏలననగా
నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్‖ స్తుతింతున్ ‖
Verse
జీవముగల నీ మార్గమును - నీవు నాకిల తెలియ జేసెదవు
నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్‖ స్తుతింతున్ ‖
Verse
సర్వోన్నతుడా నీ సన్నిధిలో - సంపూర్ణ సంతోష మెంతో గలదు
నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు - స్తుతింతున్‖ స్తుతింతున్ ‖