Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Stuthiyu Mahimayu Neeke Kshithikin Divikin

స్తుతియు మహిమయు నీకే క్షితికిన్‌ దివికిన్‌

Stuthiyu Mahimayu Neeke Kshithikin Divikin

Lyricist: Mungamuri Devadasu
Verse
రాగం: కాంభోజి
స్తుతియు మహిమయు నీకే – క్షితికిన్‌ దివికిన్‌ నీటి
వితతికిన్‌ కర్తవై – వెలయు మా దేవ
ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు
హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదును
Verse
పసిడి వర్ణపుటెండ – భాగ్యధారల వాన
విసరు మంచిగాలి – విరియు పుష్పములు
రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్‌ చాటున్‌
ప్రసరించు కోతలో – ఫలనుందు వీవు
Verse
నెమ్మదిగల యిండ్లు – నిజ సౌఖ్య కాలములు
ఇమ్మహి ఫలియించు – నైశ్వర్యాధికముల్‌
ఇమ్ముగ గలిగిన – హృదయులమై వందనమ్ములు
ఋణపడి – యున్నాము నీకు
Verse
దురితంబు లొనరించి – దౌర్భాగ్యస్థితి నున్న
ధరణికి నీ పుత్రున్‌ – ధర్మంబుజేసి
నరుల కిధర్మమున – కొరత దీర్చెడు సర్వ
వరము లమర్చిన – పరమోపకారి
Verse
జీవంబు ప్రేమను – జివను గల్గించెడు
పావనాత్మను మాకై పంపితివి
దీవెనలేడు రె – ా్లవరింపను మమ్ము
నీ విమలాత్మన్‌ మాలో గుమ్మరించు
Verse
నరులకు విమోచ – నముగల్గె పాపంబుల్‌
పరిహారమాయె గృ- పాసాధనములు
దొరికె మోక్షాంశము – స్థిరమాయె మేము నీ
కొరకేమి తేగలము పరిపూర్ణ జనక
Verse
మాకై వాడుకొనెడి – రూకల్‌ వ్యర్ధంబగును
నీకై యప్పుగనిచ్చు నిఖిల వస్తువులు
శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధన నిధియై పై
లోకంబు నందుండు – లోపంబు లేక
Verse
జీవంబు వస్తువులు – శ్రేయస్సు దాన స్వ-
భావంబు శక్తియు- భాగ్యంబులు
నీ వలననే లభ్యమై వెలయుచున్నవి
నీ వాసమే మాకు నిత్యానందంబు

Related Tags

PraiseWorshipThanksgiving