Verse
స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ
Verse
అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవె ప్రభు
నీతి న్యాయములు నీ సింహాసనాధారం
కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు
Verse
బలియు అర్పణ కోరవు నీవు, బలియైతివా నా దోషముకై నా హృదయమే
నీ ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసెద నిరతం
Verse
బూరధ్వనులే నింగిలో మ్రోగగ, రాజాధిరాజా నీవే వచ్చు వేళ
సంసిద్తతతో వెలిగే సిద్ధితో పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును