Verse
స్తుతిగానము చేసెదన్ స్తోత్రాలర్పించెదను‖ 2x ‖
ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే‖ 2x ‖
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము‖ 2x స్తుతిగానము చేసెదన్ ‖
Verse
శ్రేష్టులలో బహు శ్రేష్టుడవు
శ్రీమంతుడవు నీవేనయ్యా
ఘనులందరిలో ఘనీయుడవు
పరిశుద్ధుడవు నీవేనయ్యా‖ 2x ‖
రాజువయ్య రారాజువయ్య
రక్షకుడా విమోచకుడా‖ 2x ‖
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము‖ 2x స్తుతిగానము చేసెదన్ ‖
Verse
తేనెకన్నా జుంటే, తేనెకన్నా
మధురము నీ పలుకే
తల్లి కన్నా కన్న తండ్రి కన్న
కమ్మని నీ పిలుపే‖ 2x ‖
అందదయ నా ఊహలకు నీ ప్రేమ, వాత్సల్యము‖ 2x ‖
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము‖ 2x స్తుతిగానము చేసెదన్ ‖