Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sudha Madhura Kiranaala

సుధా మధుర కిరణాల

Sudha Madhura Kiranaala

Lyricist: Jaladi
Verse
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం‖ 2x ‖
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది‖ 2x సుధా ‖
Verse
దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని‖ 2x ‖
నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని‖ 2x ‖
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది‖ 2x ‖
నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ‖ 2x సుధా ‖
Verse
లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు‖ 2x ‖
క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా‖ 2x ‖
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే‖ 2x ‖
ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము‖ 2x సుధా ‖

Related Tags

PraiseWorshipChristmas