Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sudigalainanu

సుడిగాలైననూ

Sudigalainanu

Lyricist: Samarth Shukla, Deepika Kotecha, Philemon Anand, Benhur Binny, Vishal Das Jesh Abraham, Sheldon Bangera, Sam Alex Pasula, Anand Paul & Rachel Francis
Verse
సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం‖ 2x ‖
గడచిన కాలము నాతో ఉన్నావు
నేడు నా తోడు నడుచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే‖ 2x ‖
Verse
వ్యాధి నను చుట్టినా
లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రాఫా
నీవే నా స్వస్థత‖ 2x గడచిన ‖
Verse
ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఏ ఆయుధం
నాకు విరోధముగా వర్ధిల్లదు‖ 2x ఎగసిపడే ‖

Related Tags

WorshipComfortHope