Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sugunaala Sampannudaa

సుగుణాల సంపన్నుడా

Sugunaala Sampannudaa

Lyricist: Hosanna Ministries
Verse 1
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
Verse
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే‖ సుగుణాల ‖
Verse
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో‖ సుగుణాల ‖
Verse
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే‖ సుగుణాల ‖

Related Tags

PraiseWorshipDevotional