Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sugunaala Sampannudaa Sthuthigaanaalavaarasudaa

సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా

Sugunaala Sampannudaa Sthuthigaanaalavaarasudaa

Chorus
సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము
Verse
యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే‖ సుగుణాల ‖
Verse
యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో‖ సుగుణాల ‖
Verse
యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే‖ సుగుణాల ‖

Related Tags

PraiseWorship