Verse
సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట
గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి‖ సఖులారా ‖
Verse
విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు
ల్బడయంగ నిదితరుణంబు‖ సఖులారా ‖
Verse
మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు
సన్మార్గమొదపు నెలవు‖ సఖులారా ‖
Verse
పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసఁబ్రేమతో దీవించి
విభుడంపె నిది భావించి‖ సఖులారా ‖
Verse
ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగఁ
బఠియింప దగుఁచిత్రముగ‖ సఖులారా ‖
Verse
మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు
ఖడ్గంబు ఘనపావన వేదంబు‖ సఖులారా ‖
Verse
శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున
జేరుకొని పరులన్ రక్షించుడి చని‖ సఖులారా ‖
Verse
ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సారఁ
బ్రార్థింతము హితులారా‖ సఖులారా ‖