Verse
సుందర రక్షకా!
సృష్టియొక్క నాధా
దేవమానవ పుత్రుఁడా
నిన్నుఁ బ్రేమింతున్
సదా సేవింతున్
మదాత్మతోఁ గిరీటమా.
Verse
మైదాన మంతయుఁ
పచ్చిక బయళ్లు
నొప్పగఁ బూచుచున్నవి
ఐనను యేసుతో
నాయన కాంతిలో
దుఃఖములేనివారము.
Verse
సూర్యుని కాంతియుఁ
చంద్రుని శాంతియు
ఎంతో శ్రేష్ఠమైయున్నవి.
అట్లవి యున్న
అన్నిటి కన్న
యేసుని కాంతి గొప్పది.
Verse
ఆనంద రక్షకా!
ప్రజల నాధుఁడా
దేవమానవ పుత్రుఁడా
మహిమ, ఘనత
స్తుతి, యారాధన
నిరంతరంబు నీకగున్.