Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sundara Rakshakuda Maadu Swatantramaina Deva

సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా

Sundara Rakshakuda Maadu Swatantramaina Deva

Verse 1
Reference: నా ప్రభువా నా దేవా యోహాను John 20:28
Chorus
సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా
Pre-Chorus
ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు
స్తుతి యిదియే సుందర రక్షకుడా
Verse
రాజాధిరాజా నీవే - మా - షారోను రోజ నీవే
త్వరగా వత్తుననిన గొప్ప దేవా - నరుల మమ్ము జూడుమా
Verse
వ్యాధిగ్రస్తుల వైద్యుడా - యూద - గోత్రమున బుట్టితి
నార్తురాలైన నాయీను విధవ - కుమారుని లేపితివి
Verse
రత్నవర్ణ వదనుడా - యూద - కన్య మరియ కాత్మజా
మన్నించి పరమున జేర్చువాడా - మమ్ము బ్రేమజూడు మా
Verse
నాకము పట్టలేని - వాడా - లోకమునకు వచ్చితీ జీవ
ప్రాణమిచ్చి దాహము తీర్చితివి - హీనునిలో నుండుమా
Verse
మార్గం సత్యం జీవమై - మమ్ము - కున్కక కాపాడుచు - అర
చేతిలో మమ్ము చెక్కియున్నవడా - మంచిగొల్ల బోయుడా
Verse
ఆశ్చర్యకరుడ నీవే - మంచి - ఆలోచన కర్తయు
బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు
Verse
హల్లెలూయ పాడను - మహా - సత్యాత్మ వరమీయను
న్యాయము తీర్చుట కేతెంచువాడా - నిల్వక రారమ్మయా

Related Tags

PraiseWorshipJesus