Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sundaramulu

సుందరములు

Sundaramulu

Lyricist: Sayaram Gattu
Verse
సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు‖ 2x ‖
ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు‖ 2x ‖
Verse
యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు‖ 2x ‖
తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు‖ 2x ఏ లేమికి ‖
Verse
లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు‖ 2x ‖
తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు‖ 2x ఏ లేమికి ‖

Related Tags

CommitmentGospelEvangelism