Verse
సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడము‖ 2x సుందరమైన ‖
Verse
నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు‖ 2x ‖
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు‖ 2x ‖
యేసులేని జీవితం వాడబారిన చరితం‖ 2x ‖
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం‖ 2x సుందరమైన ‖
Verse
ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా?‖ 2x ‖
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా?‖ 2x ‖
యేసులేని జీవితం అంధకార భందురం‖ 2x ‖
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం‖ 2x సుందరమైన ‖