Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Susadhyamega

సుసాధ్యమేగా

Susadhyamega

Verse
సుసాధ్యమేగా
అసాధ్యములన్నీ
ఉపవాస ప్రార్థనలో
ఆ…ఆ…ఉపవాస ప్రార్థనలో
Verse
అందుకో నా ఉపవాస ప్రార్థన
ధూపమువోలె నా యేసయ్యా
అన్నపానములు విడచి నీ సన్నిధిలో
చేసెద నీతో సహవాసమే
Verse
అతిక్రమములు జరిగించి
అణచబడిరి మా పితరులు
ఉపవాసముతో పోరాడగా ఊరేగింపాయెను ఆ ఉరియే
అమ్మబడిన వారిని అధిపతులనుగా చేసిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే
Verse
కుడి ఎడమలు ఎరుగక
దోషము చేసిన ఆ జనములు
పశ్చాత్తాప్తులై పసికందులతో ప్రలాపించిరే పరివర్తనతో
ఉగ్రత నుండి భద్రతకు శీఘ్రముగా నడిపించిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే
Verse
కన్నీటి నైవేద్యము కానుకగా నీకర్పింపగా
కనుమరుగాయే కన్నీటి కడలి
దీవెనలాయే ఆ నిందలే
మా ఉపవాసమునే చూచిన
మా స్థితిగతులన్నీ మార్చిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే

Related Tags

WorshipPrayerFasting