Verse
సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ‖ 2x సువార్తను ‖
Verse
సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు‖ 2x ‖
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా‖ 2x లెమ్ము ‖
Verse
నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు‖ 2x ‖
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా‖ 2x లెమ్ము ‖